25, ఫిబ్రవరి 2023, శనివారం

సై రా

పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దుబిడ్డవౌరా

ఉయ్యాలవాడ నారసింహుడా

చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీరా

రేనాటి సీమ కన్న సూర్యుడా

మృత్యువే స్వయాన చిరాయురస్తు అనగా

ప్రసూతి గండమే జయించినావురా

నింగి శిరసు వంచి నమోస్తు నీకు అనగా

నవోదయానివై జనించినావురా


ఓ సైరా ఓ సైరా ఓ సైరా

ఉషస్సు నీకు ఊపిరాయెరా

ఓ సైరా ఓ సైరా ఓ సైరా

యశస్సు నీకు రూపమాయెరా


ఓ ఓ సైరా సై సై సైరా

ఓ ఓ సైరా సై సై సైరా

ఓ ఓ సైరా సై సై సైరా

ఓ ఓ సైరా సై సై సైరా


అహంకరించు ఆంగ్ల దొరల పైన

హుంకరించగలుగు ధైర్యమా

తలొంచి బ్రతుకు సాటివారి లోన

సాహసాన్ని నింపు శౌర్యమా

శృంఖలాలనే తెంచుకొమ్మని స్వేచ్ఛ కోసమే శ్వాసనిమ్మని

నినాదం నీదేరా


ఒక్కొక్క బిందువల్లె జనులనొక్క చోట చేర్చి

సముద్రమల్లె మార్చినావురా

ప్రపంచమొణికిపోవు పెను తుఫానులాగ వీచి

దొరల్ని ధిక్కరించినావురా

మొట్టమొదటి సారి స్వతంత్ర సమరభేరి

ఫెటిల్లుమన్నది ప్రజాళి పోరిది

కాళ రాత్రి వంటి పరాయి పాలనాన్ని

దహించు జ్వాలలో ప్రకాశమే ఇది


ఓ ఓ సైరా సై సై సైరా

ఓ ఓ సైరా సై సై సైరా

ఓ ఓ సైరా సై సై సైరా

ఓ ఓ సైరా సై సై సైరా


దాస్యాన జీవించడం కన్న చావెంతొ మేలంది నీ పౌరుషం

మనుషులైతే మనం అణిచివేసే జులుం ఒప్పుకోకంది నీ ఉద్యమం

ఆలినీ బిడ్డనీ అమ్మనీ జన్మనీ బంధనాలన్ని వదిలి సాగుదాం

ఓ నువ్వే లక్షలై ఒకే లక్ష్యమై అటే వేయనీ ప్రతి పదం

కదన రంగమంతా కదన రంగమంతా

కొదమ సింగమల్లే

ఆక్రమించి విక్రమించి

తరుముతోంది రా అరివీర సంహారా


ఓ సైరా ఓ సైరా

ఓ సైరా ఓ సైరా

ఓ సైరా ఓ సైరా

ఓ సైరా ఓ సైరా


ఉషస్సు నీకు ఊపిరాయెరా...


చిత్రం: సై రా

రచన: సిరివెన్నెల

సంగీతం: అమిత్ త్రివేది

గానం: సునిధి చౌహాన్, శ్రేయా ఘోషాల్





31, ఆగస్టు 2022, బుధవారం

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా

జై జై జై జై గణేశ జై జై జై జై

జై జై జై జై వినాయకా జై జై జై


జై జై జై జై గణేశ జై జై జై జై

జై జై జై జై వినాయకా జై జై జై


దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా

నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ

పిండివంటలారగించి తొండమెత్తి దీవించయ్యా

తండ్రివలె ఆదరించి తోడునీడ అందించయ్యా


దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా

నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ


చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా

పాపం కొండంత నీ పెను భారం

ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములూ తిప్పిందిరా

ఓహోహో జన్మ ధన్యం


చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా

పాపం కొండంత నీ పెను భారం

ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములూ తిప్పిందిరా

ఓహోహో జన్మ ధన్యం


అంబారిగా ఉండగల ఇంతటి వరం అయ్యోర అయ్యా

అంబాసుతా ఎందరికి లభించురా

ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా


దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా

నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ


శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం

నిన్నే చేసింది వేళాకోళం

ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా

ఏమైపోయింది గర్వం


శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం

నిన్నే చేసింది వేళాకోళం

ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా

ఏమైపోయింది గర్వం


త్రిమూర్తులే నినుగని తలొంచరా అయ్యోర అయ్యా

నిరంతరం మహిమను కీర్తించరా అయ్యోర అయ్యా

నువ్వెంతనే అహం నువ్వే దండించరా


దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా

నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ

పిండివంటలారగించి తొండమెత్తి దీవించయ్యా

తండ్రివలె ఆదరించి తోడునీడ అందించయ్యా


దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా

నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా

నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ


చిత్రం: కూలీ నంబర్ 1

రచన: సిరివెన్నెల

సంగీతం: ఇళయరాజా

గానం: ఎస్ పి బాలు




23, ఆగస్టు 2022, మంగళవారం

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు (సామజవరగమన)

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు

ఆ చూపులనలా తొక్కుకువెళ్ళకు దయలేదా అసలు


నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు

ఆ చూపులనలా తొక్కుకువెళ్ళకు దయలేదా అసలు

నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు

నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు

నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు

నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు


సామజవరగమన నిను చూసి ఆగగలనా

మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా

సామజవరగమన నిను చూసి ఆగగలనా

మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా


నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు

ఆ చూపులనలా తొక్కుకువెళ్ళకు దయలేదా అసలు


మల్లెల మాసమా మంజుల హాసమా

ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా

విరిసిన పింఛమా విరుల ప్రపంచమా

ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నగ వశమా

అరె నా గాలే తగిలినా నా నీడే తరిమినా

ఉలకవా పలకవా భామా

ఎంతో బ్రతిమాలినా ఇంతేనా అంగనా

మదిని మీటు మధురమైన మనవిని వినుమా


సామజవరగమన నిను చూసి ఆగగలనా

మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా

సామజవరగమన నిను చూసి ఆగగలనా

మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా


నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు

ఆ చూపులనలా తొక్కుకువెళ్ళకు దయలేదా అసలు

నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు

నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు



చిత్రం: అల వైకుంఠపురములో

రచన: సిరివెన్నెల

సంగీతం: థమన్

గానం: సిద్ శ్రీరాం




కాలం ఆగాలి నా కాలి వేగం చూసి (రం పం బం)

కాలం ఆగాలి నా కాలి వేగం చూసి

లోకం సాగాలి నా వేలి సైగే తెలిసి

కాలం ఆగాలి నా కాలి వేగం చూసి

లోకం సాగాలి నా వేలి సైగే తెలిసి


కొండలే ఊగిపోవాలి నా జోరుకి

దిక్కులే పారిపోవాలి నా హోరుకి

హేహే రంగేళి రంగాల పొంగే తరంగాలు తాకాలి ఆ నింగికీ


రం పం బం రం పం బం రం పం బం రం పం బం


కాలం ఆగాలి నా కాలి వేగం చూసి

లోకం సాగాలి నా వేలి సైగే తెలిసి


అడుగు పడిన ప్రతిచోటా కడతా నేనేలే కోటా

కాదు కూడదని ఎవడొస్తాడో రానీరా చూస్తా

పేట పేటకూ రాజుంటాడా కుదరదురా బేటా

శరణు శరణు మారాజా అంటే అభయం అందిస్తా


జనం అందరూ జ్వరం తెచ్చుకుని జడుస్తారు మన పేరు వింటే

ఇలాంటోడు ఈ ప్రపంచాన మరి ఒకే ఒక్కడంతే

అంటూ బేజారు పుట్టాలి జేజేలు కొట్టాలి ఈ రోజు మన ధాటికి



చిత్రం: డిస్కో రాజా

రచన: సిరివెన్నెల

సంగీతం: థమన్

గానం: రవితేజ, బప్పీలాహిరి, శ్రీక్రిష్ణ



మనసు మరీ మత్తుగా

మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ

వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీల

అంతగా కవ్విస్తావే గిల్లి

అందుకే బంధించెయ్ నన్నల్లి

ఖిలాడి కోమలీ గులేబకావళీ

సుఖాల జావళీ వినాలి కౌగిలి


మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ

వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీల


ఓ అడుగులో అడుగువై ఇలారా నాతో నిత్యం వరాననా

హా బతుకులో బతుకునై నివేదిస్తా నా సర్వం జహాపనా

పూల నావ గాలి తోవ హైలో హైలెస్సో

చేరనీవా చేయనీవ సేవలేవేవో


మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ

వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీల


మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇదీ

మనువుతో మొదలయే మరో జన్మాన్నై పుట్టే వరమిదీ

నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో

నాలో పెంచా నీ కలలన్నీ ఊగనీ ఊయల్లో


మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ

వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీల

అంతగా కవ్విస్తావే గిల్లి

అందుకే బంధించెయ్ నన్నల్లి

ఖిలాడి కోమలీ గులేబకావళీ

సుఖాల జావళీ వినాలి కౌగిలి



చిత్రం: వి (V)

రచన: సిరివెన్నెల

సంగీతం: అమిత్ త్రివేది

గానం: అమిత్ త్రివేది, షాషా తిరుపతి, యాసిన్ నిజర్





21, ఆగస్టు 2022, ఆదివారం

చూపులే నా గుండే అంచుల్లో (కోల కళ్ళే)

చూపులే నా గుండే అంచుల్లో

కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే

పువ్వులా నా ఊహల గుమ్మంలో తోరణమవ్వుతూ నువ్వే నిలుచున్నావే

కొంచెమైనా ఇష్టమేనా అడుగుతుందే మౌనంగా నా ఊపిరే

దూరమున్నా చేరువౌతూ చెప్పుకుందే నాలోని ఈ తొందరే


కోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా

నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా

కొంటె నవ్వే ఇలా చంపుతుంటే ఎలా

కొత్త రంగుల్లో ప్రాణమే తడిసేంతలా


మళ్ళి మళ్ళి రావే పూల జల్లు తేవే


నువ్వెళ్ళే దారులలో చిరుగాలికి పరిమళమే

అది నన్నే కమ్మేస్తూ ఉందే

నా కంటి రెప్పలలో కునుకిలకిక కలవరమే

ఇది నన్నే వేధిస్తూ ఉందే

నిశినలా విసురుతూ శశి నువ్వై మెరవగా

మనసులో పదనిసే ముసుగే తీసెనా

ఇరువురం ఒకరిగా జతపడే తీరుగా

మన కథే మలుపులే కోరేనా


కోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా

నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా

కొంటె నవ్వే ఇలా చంపుతుంటే ఎలా

కొత్త రంగుల్లో ప్రాణమే తడిసేంతలా


మళ్ళి మళ్ళి రావే పూల జల్లు తేవే


చూపులే నా గుండే అంచుల్లో

కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే


మళ్ళి మళ్ళి రావే


చిత్రం: వరుడు కావలెను

రచన: సిరివెన్నెల

సంగీతం: విశాల్ చంద్రశేఖర్

గానం: సిద్ శ్రీరాం




మనసులోనె నిలిచిపోకే మైమరపుల మధురిమ

మనసులోనె నిలిచిపోకే మైమరపుల మధురిమ

పెదవి దాటి వెలికిరాక బెదురెందుకే హృదయమా

మనసులోనె నిలిచిపోకే మైమరపుల మధురిమ

పెదవి దాటి వెలికిరాక బెదురెందుకే హృదయమా


ఎన్నినాళ్ళిలా ఈ దోబూచుల సంశయం

అన్నివైపులా వెను తరిమే ఈ సంబరం

అదును చూసి అడగదేమి లేనిపోని బిడియమా

ఊహలోనే ఊయలూపి జారిపోకె సమయమా

తడబడే తలపుల తపన ఇదని తెలపక


మనసులోనె నిలిచిపోకే మైమరపుల మధురిమ

పెదవి దాటి వెలికిరాక బెదురెందుకే హృదయమా

మనసులోనె నిలిచిపోకే మైమరపుల మధురిమ

పెదవి దాటి వెలికిరాక బెదురెందుకే హృదయమా


రా ప్రియ శశివదనా అని ఏ పిలుపూ వినబడెనా

తనపై ఇది వలనా ఏదో భ్రమలో ఉన్నానా

చిటికే చెవిబడీ తృటిలో మతి చెడీ

నానా యాతనా మెలిపెడుతుండగా


నా ప్రతి అణువణువు సుమమై విరిసే తొలి ఋతువు

ఇకపై నా ప్రతి చూపు తనకై వేచే నవ వధువు

చెలిమే బలపడి ఋణమై ముడిపడే 

రాగాలాపన మొదలౌతుండగా


మనసులోనె నిలిచిపోకే మైమరపుల మధురిమ

పెదవి దాటి వెలికిరాక బెదురెందుకే హృదయమా

మనసులోనె నిలిచిపోకే మైమరపుల మధురిమ

పెదవి దాటి వెలికిరాక బెదురెందుకే హృదయమా



చిత్రం: వరుడు కావలెను

రచన: సిరివెన్నెల

సంగీతం: విశాల్ చంద్రశేఖర్

గానం: చిన్మయి శ్రీపాద